mt_logo

లాంఛనంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సు

హైటెక్స్ లో 11వ అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, గవర్నర్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ప్రపంచంలోని పలు దేశాల నుండి వచ్చిన నగర మేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దాలనేదే సీఎం కేసీఆర్ విజన్ అని, ఇండియాలోనే టాప్ 6 నగరంగా చేయాలనేది కేసీఆర్ సంకల్పమని అన్నారు.

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని, చారిత్రక నగరమైన హైదరాబాద్ ను చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారని, ప్రపంచంలోనే ఈ నగరం అన్ని రకాలుగా అనువైన నగరం అని ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, కేసీఆర్ చిత్తశుద్ధిని తాము అభినందిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *