హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థరాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం వెంట నిలిచారు అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుంది అని ఎద్దేవా చేశారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు అని దుయ్యబట్టారు
పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైంది. ఫిరాయింపులపై స్పీకర్‌ని కలిసి సుప్రీంకోర్టు తీర్పలను సైతం ఉటంకిస్తూ ఫిర్యాదు చేసినం అని తెలిపారు.
దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరి మీద డిస్‌క్వాలిఫై పిటీషన్ వేసిందే కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ తరపున హైకోర్టు జస్టిస్‌కి కృతజ్ఞతలు చెబుతునన్నా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి చావు డప్పులు కొట్టండి అని మాట్లడిందే రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపుడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి దిగారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడు లేదు.. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారు అని అన్నారు.
శాతగాని ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా జరుగుతుంది.. రేపు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా యీ పార్టీలో ఉన్నారో చెప్పాలి అని అడిగారు.
గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారు. నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశాం.. పైశాచిక ఆనందం కోసమే ఇదంతా రేవంత్ చేస్తున్నాడు ఇవన్నీ తిరిగి రేవంత్‌కి తిరిగి చుట్టుకుంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థరాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం మా వెంట నిలిచారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారు అని అన్నారు.
నిన్న మముల్ని హౌజ్ అరెస్ట్ చేసి గాంధీని రక్షణ కల్పించారు.గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు కాదు. హైదరాబాద్‌లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసాము. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు అందరు మావారే అని స్పష్టం చేశారు.
ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవు.. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు చేరినవ్ దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలి. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారు అని ధ్వజమెత్తారు.
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- Fearing backlash, saree distribution to women’s groups in 6 districts halted
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి