ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు చేయాలని వాట్సాప్‌లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య బెల్ట్‌తో కొట్టిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుడు భాస్కర్‌కు ఫోన్ చేసిన జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
దాడికి పాల్పడిన సీఐపై న్యాయపరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ మొత్తం భాస్కర్‌కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి అడిగిన వారిని ఇలా పోలీసులతో కొట్టించటం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. బాధితుడు భాస్కర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో నూ కేటీఆర్ మాట్లాడారు. భాస్కర్ విషయంలో ఎంత దూరమైన కలసికట్టుగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించారు.
- 75-question caste survey raises concerns over future implications
- BRS govt. made decision to fund Formula-E race to boost Hyderabad’s brand: KTR
- Fact Check: Did the BRS govt. misappropriate Rs. 55 cr for Formula-E race?
- Impending liquor price hike to generate Rs. 7,000 cr revenue
- Telangana farmers in distress due to yield decline and lack of govt. support
- ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు రేవంత్‌కు అలవాటుగా మారింది: కేటీఆర్
- పుట్టినరోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించు: రేవంత్‌కు హరీష్ రావు హితవు
- ఫార్ములా-ఈ రేస్ జరగకుండా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీసినందుకు రేవంత్‌పైనే కేసు పెట్టాలి: కేటీఆర్
- కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: కేటీఆర్ ధ్వజం
- రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- కేబినెట్ మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ప్రాజెక్టులా?: కేటీఆర్ ధ్వజం
- గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
- కేవలం బ్లాక్మెయిల్ దందా కోసం హైడ్రాని పెట్టారు: రియల్టర్స్ ఫోరం సమావేశంలో కేటీఆర్
- కుటుంబ సర్వే నుండి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలి: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
- ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: కేటీఆర్