గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్లాలో కలిగిన వరద నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. భవిష్యత్తులో వరదలు వచ్చినా ఎలాంటి నష్టం జరగకుండా నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పంట నష్టానికి సంబంధించిన నివేదికను వారం రోజుల్లో సమర్పించాలన్నారు.
తదనంతరం సిరిసిల్ల టౌన్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి ప్రజలతో సంభాషించారు. త్వరితగతిన సహాయ కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.