
కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాలలకు భవనాల యజమానులు తాళాలు వేసిన సంఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురుకులాల నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు.
ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి.. కమీషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి. కానీ.. పేద విద్యార్థుల చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా? అని ప్రశ్నించారు.
ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతున్నది అని.. ఇది సిగ్గుపడాల్సిన విషయమని కేటీఆర్ దుయ్యబట్టారు.