mt_logo

ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు రేవంత్‌కు అలవాటుగా మారింది: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారింది అని దుయ్యబట్టారు.

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యంపైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

నిర్బంధంలోకి తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి లను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.