ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే జాలేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఓఆర్ఆర్ లీజును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగించిందని రెవెన్యూ మంత్రి ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నిజంగానే తక్కువ ధరకు ఓఆర్ఆర్‌ను లీజుకు ఇస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది. దమ్ముంటే వాళ్ల ఆరోపణలు నిజమైతే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే ఆ లీజును రద్దు చేయాలి అని సవాల్ విసిరారు.
టీఓటీ (టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) లీజును రద్దు చేసి.. తాజాగా కొత్త బిడ్‌లను పిలవాలని సవాల్ చేస్తున్నా అని అన్నారు.. తమ చేతిలో ఉన్న పని చేయకుండా ఊరికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా మీరు చేసే ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని గ్రహిస్తారు అని పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ లీజు విషయంలో మేము ఎన్‌హెచ్ఏఐ (NHAI) నిబంధనలను అనుసరించాం.. ఈ లీజు విషయంలో తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే అది ఎంతో కాలం సాగదు అని కేటీఆర్ అన్నారు.
- Teachers’ transfers: No teachers in 17 Model Schools across Telangana
- Rs. 4,500 cr debt in September: Revanth pushing Telangana into debt trap
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్: హరీష్ రావు
- పాలన పక్కన పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ని దూషించటమే రేవంత్ పని: కేటీఆర్
- బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం: కేటీఆర్
- రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమవుతున్నది: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
- రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు
- రేవంత్ చేసిన అబద్ధపు ప్రచారాలు vs అసలు నిజాలు
- అధిష్టానం వద్ద పరపతి కోల్పోయిన రేవంత్?
- నమ్మించి గొంతుకోసిన రేవంత్!
వలస ఎమ్మెల్యేల బతుకు ‘బస్‌స్టాండేనా’? - రేవంత్ సీఎం అయింది పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికా?: కేటీఆర్
- హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైంది: కేటీఆర్