
గాంధీ ఆసుపత్రిలో ఆగస్ట్ నెలలో 48 మంది పసి గుడ్డులు, 14 మంది బాలింత తల్లులు ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా అని ప్రశ్నించారు.
ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? అని అడిగారు.
తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది.. ఎందుకు భయపడుతోంది.. ఆ తల్లీబిడ్డల ఉసురు ప్రభుత్వానికి తగలదా.. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది అని ఆవేదన చెందారు.
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి, బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారు. అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవటం అని కేటీఆర్ గుర్తు చేశారు.
మన చీప్ మినిస్టర్ ఏం చేస్తున్నారో.. పాలన గాలికి వదిలి, ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటది అని మండిపడ్డారు.
