హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరిగ్గా సంవత్సరం కింద ఇదే రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. ఆడపిల్లల ఓట్ల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం దొంగ హామీలను ఇచ్చారు అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క బీసీ డిక్లరేషన్ హామీ అయినా అమలు చేసిందా? కొత్త పథకాల విషయం దేవుడెరుగు.. ఉన్న వాటిని కూడా కాంగ్రెస్ ఎత్తగొట్టింది. వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేతి వృత్తులకు చేయూతనిస్తూ బలహీన వర్గాలకు విద్య, వృత్తి లాంటి అన్ని అవకాశాల్లో ఆసరాగా నిలిచింది. పథకాలన్నింటికీ పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు తర్వాత బీసీల కోసం బీసీ బంధు ప్రవేశపెట్టింది. కానీ రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంధు, రైతుబంధు, దళిత బంధు ఇలా అన్ని బంద్ అయినయి అని దుయ్యబట్టారు.
కుల గణన ఖచ్చితంగా చేయాల్సిందే. కుల గణన పూర్తయిన తర్వాతనే, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ప్రధాన ప్రతిపక్షంగా బహుజన వర్గాల తరఫున ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. 60 ఏళ్లలో కనీసం బలహీనవర్గాల కోసం కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. 60 ఏళ్ల పాటు ఎంతోమంది అడిగినా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని పరిస్థితి కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు.
2004 డిసెంబర్ 17న కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ సంఘాలతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ని కలిసి బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఉండదు అని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన నాయకులు కేసీఆర్. 60 ఏళ్లు బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ చరిత్రపైన ప్రజలకు నమ్మకం లేదు. బీసీ కుల గణనపై, ఈ ప్రభుత్వంపైన ప్రజలకు నమ్మకం లేదు. అందుకే ఇంటింటికి వెళ్తున్న అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్ళిన ప్రతి అధికారిని ఆరు గ్యారెంటీల పైన 420 హామీల పైన ప్రశ్నిస్తున్నారు అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీల అమలును ప్రజలు ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ కార్యక్రమం కాకుంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి. కులగణనలోని ప్రశ్నలు తగ్గిస్తే బాగుంటుంది. ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటిన అమలు చేయలేదు అని అన్నారు.
42శాతం రిజర్వేషన్లు అమలు అయినంకనే ఎన్నికలు పెట్టాలని ఇంటికి వచ్చే ప్రభుత్వాధికారులను, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వాధికారులపై ఉన్నది అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి బీసీల కోసం ఇచ్చిన హామీలపైన, ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలుపైన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మా పార్టీ బృందం తమిళనాడులో పర్యటించి అక్కడ బీసీలకు అమలు అవుతున్న రిజర్వేషన్లను అధ్యయనం చేసింది. చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు మాదిరి తెలంగాణలో కూడా చేయవచ్చు అని పార్టీ బృందం చెప్పింది అని అన్నారు.
మూడు లక్షల రూపాయల ఆదాయమున్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఎక్కడ పోయింది. ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. ఎక్కడికి పోయింది? ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నారు. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పారు. ఒక్క బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా ? ఐదేళ్లలో బీసీల సంక్షేమ కోసం సంవత్సరానికి రూ 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు. కేవలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అందులో ఎంత ఖర్చు పెడతారో ఎవరికీ తెలియదు అని విమర్శించారు.
బీసీల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ప్రారంభించనందుకు రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ కాంట్రాక్టులో 42 శాతం బీసీలకు ఇస్తామని చెప్పి మాటతప్పినందుకు రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్‌లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. బీసీ వెల్ఫేర్ శాఖతోపాటు ఎంబీసీలకు మరొక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. ఉన్న మంత్రులనే నింపుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి.. కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి అవసరం ఉన్న 18 మందిని నింపుకోలేని చేతకానివాడు రేవంత్ రెడ్డి. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఒక్కదానికైనా కనీసం పని మొదలైందా? ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరిట బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు.. ఏమైంది? అని అడిగారు.
చేతివృత్తుల వారికి 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చి.. అందరికీ 4000 ఇస్తా అన్నావ్.. కొత్త పెన్షన్లు వదిలేసి ఉన్న పెన్షన్లు కూడా సరిగా ఇస్తలేరు. వాళ్లందరికీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కి మారుస్తా అన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.
100 రోజుల్లో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ముదిరాజులకు, గొల్ల కురుమలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. గౌడన్నలకు 5 ఎకరాలు భూమి ఈత వనాల కోసం ఇస్తామన్నారు. ఏమైంది? పద్మశాలీలకు మెగా పవర్ లూమ్ ఇస్తా అన్నావ్.. నేతన్నలను ఆత్మహత్యల పాలు చేస్తున్నవ్. ఇప్పటిదాకా 34 మంది నేత కార్మికులు చనిపోయారు. బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు.
బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తామని చెప్పినవ్. ఇప్పటి దాకా ఆ అంశం ఏమైంది? బీసీలను మోసం చేసేందుకు మాత్రమే బీసీ డిక్లరేషన్ వాడుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలకు క్షమాపణ చెప్పాలి. దళిత బంధు నిధులు ఇవ్వాలని అడిగితే మా ఎమ్మెల్యేల పైన దాడులు చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీ,ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక భరోసా కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పినవ్. అబద్ధాల ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అడుగుతూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లన్నింటిపైనా ప్రశ్నిస్తూనే ఉంటాం. డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి. అన్ని డిక్లరేషన్లు అమలు అయ్యేదాకా రేవంత్‌ను వదిలిపెట్టం అని హెచ్చరించారు.
మేము చేసిన పనులు మీరు చేసినట్టు చెప్పుకుంటే ప్రజలు కాంగ్రెస్ నాయకుల బట్టలు ఊడదీసి కొడతారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పైన కూడా మేము వైఫల్యాల వారోత్సవాలను నిర్వహిస్తాము అని తెలిపారు.
- Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government
- Revanth govt. abandons, but Tamil Nadu steps up to support Sircilla weavers
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ల సమస్యను లేవనెత్తుతాం: తాజా మాజీ సర్పంచ్‌లతో కేటీఆర్
- లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం
- హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు
- బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారు: కవిత
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్
- సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్