mt_logo

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం: నందిని సిధారెడ్డిని కలిసిన కేటీఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నందిని సిధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం అందించిన కోటి రూపాయల నగదు పారితోషికం మరియు ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి గారు చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుంది అని అన్నారు.

తెలంగాణ కోసం కోటిరూపాయాలను, ప్లాట్‌ను తిరస్కరించిన  సిధారెడ్డి గారి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అల్వాల్‌లోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్, సిధారెడ్డి గారి ఉద్యమకాల స్మృతులను నెమరు వేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్ధిత్వంపైన కుట్రలు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడ్డి గట్టి సందేశం పంపారని కేటీఆర్ అన్నారు.

“తెలంగాణ బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైన వెనకాడని, సిధారెడ్డి గారి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్థిత్వ దాడులపై చర్చ జరగింది. “ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన, అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

“తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారు,” అని కేటీఆర్ అన్నారు.
నందిని సిధారెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. 

నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్‌కు అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.