mt_logo

దేశానికి జోర్దార్, ధమ్ దార్, ఇమామ్ దార్ లాంటి కేసీఆర్ కావాలి..

ములుగులో ఈరోజు జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 71 ఏండ్లు అవుతున్నా కూడా దేశం అభివృద్ధి చెందలేదు. ఈ ఐదేండ్ల కాలంలో మోడీ ఒక్క మంచి పని చేయలేదు. ఈ మధ్య మోడీ మై భీ చౌకీదార్ అంటున్నారు. ఒకాయన చౌకీదార్ అంటారు. ఇంకొకాయన మా ముత్తాత ఈ దేశాన్ని నడిపిండు. మా నాయనమ్మ ఈ దేశాన్ని నడిపింది. మా నాయన ఈ దేశాన్ని ఏలిండు. కాబట్టి నేనే టేకేదార్ అని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఈ దేశానికి ఇవాళ కావాల్సింది ఒక చౌకీదారో.. టేకేదారో కాదు.. ఒక జోర్దార్, ఒక ధమ్ దార్, ఒక ఇమామ్దార్.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దేశానికి ఒక కేసీఆర్ కావాలని అన్నారు.

కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చారు. చంద్రబాబు కూడా రైతుబంధును కాపీ కొట్టి సిగ్గులేకుండా ఇవాళ మాట్లాడుతున్నారు. ఆంధ్రా రైతులకు నాలుగు పైసలు ఇస్తున్నాడు అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. 2014లో ఉన్న వాతావరణం ఇవాళ దేశంలో లేదు. మోదీకి 150 సీట్లు మించి రావు. కాంగ్రెస్ కు 100 సీట్లు దాటే అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలంటే ఇష్టం లేని పార్టీలు చాలా ఉన్నాయి. బీఎస్పీ, తృణమూల్, ఎస్పీ, వైసీపీతో పాటు చాలా పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సందర్భంలో మనం కీలకం కాబోతున్నాం. 16 ఎంపీ సీట్లు మనవి ఉంటే హైదరాబాద్ కు బుల్లెట్ రైలు వస్తది. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు 95 శాతం నిధులు వస్తాయి. కేంద్రం జుట్టు మన చేతిలో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకునేవారు ఆలోచించి ఓటేయాలి. ఇవి మామూలు ఎన్నికలు కావు. దేశాన్ని మలుపుతిప్పే ఎన్నికలు. దేశం మొత్తం మనవైపే చూస్తుంది. మన నాయకుడికి ఢిల్లీలో పట్టు ఉండాలంటే మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. రాష్ట్రాభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమని, ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *