
హైడ్రాపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల గూడు కూల్చుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై పడేశారు.. గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరిన కేటీఆర్.. హైదరాబాద్లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్సా కాదా? అని అడిగారు.
పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు.. వారికి అండగా ఉంటుంది అని కేటీఆర్ భరోసానిచ్చారు.