mt_logo

కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వ నిరక్ష్యం వల్లే ప్రాణ నష్టం జరిగింది: కేటీఆర్


కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని, కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.

వాతావరణ శాఖ అలెర్ట్ చేసినా రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు.. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ కూడా లేవు అని విమర్శించారు.

రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు.. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు.. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు అని ఫైర్ అయ్యారు.

జరగాల్సిన నష్టమంతా జరిగాక.. పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని
వరదల మీద సమీక్ష చేసే ఛీప్ మినిస్టర్.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు.