
మంత్రి కొండా సురేఖపైన పరువు నష్టం కేసు వేసి, ఆమెపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసు వేశారు.
ఇప్పటికే కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. చట్ట ప్రకారం కొండా సురేఖపైన ఈరోజు నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి ఎలక్షన్ కమిషన్‌తో చీవాట్లు తిన్న సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. పదేపదే కావాలని దురుద్దేశంతో కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా పలుసార్లు చేసిన వ్యాఖ్యలను నేరపూరితంగా చూడాలని కేటీఆర్ కోరారు.
కొండా సురేఖ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని కుట్రపూరితంగా, దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించినట్లు తన కేసులో కేటీఆర్ పేర్కొన్నారు.