ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపొస్తలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులే కొడుతున్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు అని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది. మూసీ సుందరీకరణ కేవలం రూ. 1,100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే పూర్తి అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు అని చెప్పి అవినీతి కోసం కుట్ర చేస్తుంది అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చెప్పిన లక్షన్నర కోట్ల మాట నేను అంటే నాపై ప్రభుత్వం కేసు పెట్టింది. వంద రోజుల్లో పూర్తి చేస్తా అన్న హామీలను గ్యారంటీలను రేవంత్ మరిచిపోయిండు అని దుయ్యబట్టారు.
మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల గురించి మాట్లాడుతున్నాడు. మా పార్టీ మూసీకి వ్యతిరేకం కాదు కానీ మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి లక్షన్నరకోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోం. హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ పూర్తి అయి అనుమతులు ఉండి పన్నులు కడుతున్న వారి ఇళ్లను కూలగొడుతున్నారు అని అన్నారు.
పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసేదాకా ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేదాక పేద ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతం. హైదరాబాద్ నగర ప్రజల కోసం మా పార్టీ అండగా ఉంటుంది. మీ ఇంటిపైకి బుల్డోజర్లు వస్తే నాతో సహా పార్టీ నాయకులందరూ అడ్డుపడతాం అని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేరన్న కక్షతోనే రేవంత్ రెడ్డి ఈ విధ్వంసం చేస్తున్నారు. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. 10 సంవత్సరాల మా ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసుకున్నాం అని గుర్తు చేశారు.
24 గంటల విద్యుత్తు నిరంతరంగా సరఫరా చేయడంతో పాటు తాగునీటి కోసం కష్టాలు లేకుండా చేశాం. హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేలా అన్ని రంగాల్లో అభివృద్ధిని చేపట్టాం. హైదరాబాద్ నగర మురుగు నీరు శుద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం అని కేటీఆర్ తెలిపారు.
మూసీ నదిలో మూరికినీటి రాకుండా ఎస్టీపీల నిర్మాణం చేపట్టాం. రూ. 3,866 కోట్ల రూపాయలతోని ఎస్టీపీల నిర్మాణం మనం చేపడితే మొన్న ముఖ్యమంత్రి వచ్చి ఉప్పల్లో ప్లాంట్ ప్రారంభించారు. మూసీ పునరుజ్జీవం అని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.. కానీ రూ. 4,000 కోట్లు ఖర్చుపెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసింది అని అన్నారు.
దీంతోపాటు కొండపోచమ్మ సాగర్ నుంచి నగర జంట జలాశయలకు మీరు తీసుకువచ్చి మూసీలో స్వచ్ఛమైన తాగునీరు పోసేందుకు గత ప్రభుత్వమే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. మూసీపైన ఇప్పటికే బ్రిడ్జీల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా గత ప్రభుత్వమే పూర్తి చేసింది. ఉప్పల్, నాచారం వంటి చోట్ల మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం అని పేర్కొన్నారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు