ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి టికెట్ల ముసుగులో వ్యాపారం చేస్తున్నదని ఆ పార్టీకి చెందిన ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి ఆరోపించారు. పైసల దందాను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వివరించారు. ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవించిన టీజేఏసీ, డబ్బు వసూళ్లకు పాలపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తే, వారికే సీట్లు అన్నవిధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయారు. కపిలవాయి దిలీప్ కుమార్ బృందం ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. మిగతా విషయాల్లో ఏమాత్రం మహిళలకు విలువ ఇవ్వని టీజేఎస్ నేతలు, టికెట్ల విషయంలో మాత్రం మహిళలను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు.
ఉదయం ఆకాంక్ష, లక్ష్యాలు అనే దిశగా మొదలుపెట్టిన పార్టీ..ఇప్పుడు కేవలం బిజినెస్ సెంటర్ గా మారిపోయిందన్నరు. కోదండరాం దృష్టికి తీసుకువెళ్లి నా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇన్ని బాధలు పడుతూ..తనను తాను, తెలంగాణ ప్రజల ను మోసం చేయడం తగదని ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనికి పర్యవసానంగా..ఆ పార్టీ నేతల నుండి బెదిరింపులు, అసభ్య దూషణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అనుచరులు ఫోన్లు చేసి చంపుతామని, మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. టీజేఎస్ నేతలతో తనకూ, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కోసం డీజీపీని ఆశ్రయించనున్నట్లు తెలిపారు!