నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ ఒక్క ప్రాంతానికి చెందిన నగరం కాదని, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేస్తానంటున్న నరేంద్రమోడీ నిజస్వరూపం ఈరోజు నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూ చదివితే తెలుస్తుందని అన్నారు. చచ్చిపోయిన శవంలా ఉన్న టీడీపీని భుజాన వేసుకుని తిరుగుతున్నాడని, హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేయాలని చూస్తున్న బీజేపీని పాతాళంలో తొక్కాలని కేసీఆర్ పేర్కొన్నారు.
మా తాత ముత్తాతల తహసీల్ తో కట్టిన హైదరాబాద్ ఇది. హైదరాబాద్ నీ అబ్బ సొత్తా మోడీ? అని కేసీఆర్ మండిపడ్డారు. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క సినీ యాక్టర్ ను పెట్టుకుని మోడీ తనకున్న అవకాశాన్ని పోగొట్టుకున్నాడని విమర్శించారు. ఆంధ్రావాళ్ళ మాటలకు మోసపోవద్దని, అలోచించి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.