కొంతకాలంగా దూరంగా ఉన్న తెలంగాణా ఉద్యమ దిగ్గజాలు కలిశారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కలిసికట్టుగా ప్రకటించారు. నిన్న కే.సి.ఆర్ ఇంట్లో ప్రొఫెసర్ కోదండరాం, ఇతర జే.ఏ.సి. నేతలు సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకున్నారు.
Image courtesy: Janam Sakshi
భేటీ అనంతరం కే.సి.ఆర్ మాట్లాడుతూ “పార్లమెంట్ శీతకాల సమావేశాలకు హాజరవుతాం. పార్లమెంట్ స్తంభింపజేస్తాం. త్వరలో టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తాం. డిసెంబర్ 9, 23 తేదీల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిర్ణయాన్ని తీసుకుంటాం” అని తెలిపారు. నవంబర్ 23న సూర్యాపేటలో నిర్వహించనున్న తెలంగాణ సమరభేరి, ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌లను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ రెండు కార్యక్రమాల్లో తెలంగాణ జేఏసీ భాగం పంచుకుంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రొఫెసర్ కోదండరాంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కే.సి.ఆర్ తీవ్రంగా ఖండించారు.