mt_logo

తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని అన్నారు.

హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.