mt_logo

ఢిల్లీలో మోడీ ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్

రాష్ట్రపతి భవన్ లో సోమవారం జరిగిన మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన 11మంది టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ డిల్లీలోని తననివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఎంపీలను ఆయన అభినందించారు.

ఇదిలా ఉండగా అదేరోజు మెదక్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సంపూర్ణ తెలంగాణ సాధించే లక్ష్యంగా మెజారిటీ ఎంపీలను గెలుచుకోవడం తనకు ఆనందంగా ఉందని, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, బంగారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టడానికి కృషి చేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *