తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై దుష్ప్రచారం మానాలని తెలంగాణ టీడీపీ నేతలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ హెచ్చరించారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ, మిషన్ తెలంగాణను చూసి టీటీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. గొప్ప సంకల్పంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
సమసమాజం కోసం పాటుబడ్డ మావోయిస్టులను పిట్టల్లా కాల్చిచంపిన ఘనచరిత్ర చంద్రబాబుదని, బాబు దుర్మార్గపు పాలనలో గద్దరన్న వెన్నులో బుల్లెట్ దిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు గద్దరన్న మిషన్ కాకతీయపై ప్రచారానికి బయల్దేరారని కర్నెప్రభాకర్ చెప్పారు.