లండన్ మహానగరం లో జయశంకర్ సార్ జయంతి వేడుకను అక్కడ నివసిస్తున్నతెలంగాణ ప్రజలు చాలా ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ తెలంగాణ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు వందల సంఖ్యలో తెలంగాణ బిడ్డలు పాల్గొని పెద్దసారుకు ఘన నివాళి అర్పించారు.
తెలంగాణ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ శ్రీ జీవన్ కుమార్ శ్రీరాములు గారు, సుప్రీమ్ కోర్ట్ లాయర్, TDF UK Europe ఛైర్మన్ శ్రీ కమల్ ఓరుగంటి గారు, జయశంకర్ తెలంగాణ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ వి ప్రకాష్ (తెలంగాణ ప్రకాష్) గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
శ్రీ జీవన్ కుమార్ శ్రీరాములు గారు జయశంకర్ సార్ తో తనకు ఉన్న ఆనుబంధాన్ని పంచుకోగా, కమల్ ఓరుగంటి గారు జయశంకర్ సార్ ఉద్యమానికి అందించిన విలువలను సేవలను కొనియాడారు. జయశంకర్ తెలంగాణ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్లోబల్ అధ్యక్షులు శ్రీ వి ప్రకాష్ గారు మాట్లాడుతూ వివిధ ధేశాలలో సంస్థ చేసిన పలు సామాజిక సేవలను, రీసర్చ్ పనులను వాటి ఉపయోగాలను సభకు తెలియచేశారు.
జయశంకర్ తెలంగాణ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లండన్ అధ్యక్షులు శ్రీ చాడ సృజన్ రెడ్డి గారు మాట్లాడుతూ లండన్ లో సంస్థ చేసిన పలు సామాజిక సేవలను సభకు తెలియచేశారు. శ్రీ చిత్తరంజన్ రెడ్డి, నవీన్ పొన్నాల, మధు అందెం, రామకృష్ణ పోరండ్ల, రామకృష్ణా రెడ్డి, రోహిత్ రావు (జాగృతి లండన్ విభాగం) అధ్యక్షులు, శ్రవణ్ (TDF-UK ) అధ్యక్షులు మాట్లాడుతూ జయశంకర్ సేవలను కొనియాడారు.