ఇంగ్లాండ్‌లోని ప్రధాన నగరం బ్రిస్‌బేన్‌లో దేశ స్వాతంత్య్ర వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ బ్రిస్‌బేన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏడు రాష్ట్రాలకు చెందిన భారతీయులు పాల్గొన్నారు. పంద్రాగస్టున జరుపుకోవాల్సిన వేడుకలను సెలవుదినం కావడం వల్ల ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రిస్‌బేన్ నగర మేయర్ గ్రాహంక్విర్క్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రజాకాంక్ష మేరకు ఏర్పడిందని గుర్తించామని, సీఎంగా ఎన్నికైన కే చంద్రశేఖర్‌రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుంటామని ప్రకటించారు. తెలంగాణ బ్రిస్‌బేన్ అసోసియేషన్ అధ్యక్షుడు నిఖిల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక, తెలంగాణ రాష్ట్ర లోగో, వరంగల్ కాకతీయ తోరణం, చార్మినార్ వంటి లోగోలను ప్రదర్శించారు.