mt_logo

పార్టీలకతీతంగా తెలంగాణలో భూకబ్జా చేస్తున్న సీమాంధ్ర నేతలు!!

సీమాంధ్ర దోపిడీ మూకలు ఇంకా తెలంగాణను పట్టుకునే వేళ్ళాడుతున్నారు. ఇన్నాళ్ళూ తెలంగాణను దోపిడీ చేసింది చాలక ఆఖరి నిమిషం వరకూ ఎంత దోచుకోగలిగితే అంత అని పార్టీలకతీతంగా సీమాంధ్ర రాజకీయ దోపిడీదారులు దొడ్డిదారి, అడ్డదారి ఏదీ వదలకుండా తెలంగాణ భూములపై విరుచుకుపడ్డారు. నాలుగురోజుల్లో తెలంగాణ నుండి వెళ్ళిపోయే అధికారుల అడ్డగోలు సంతకాలతో కబ్జా చేసిన భూముల విలువ 1500 కోట్లకు పైగా ఉంటుంది. షేక్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ముషీరాబాద్ లాంటి ప్రాంతాలలో సర్కారు భూములను రాత్రికి రాత్రే సీమాంధ్ర అధికారులు, నేతలు పంచుకుంటున్నారు.

తెలంగాణ భవన్ కు సమీపంలో ఉన్న భూమిని సైతం వదల్లేదంటే సీమాంధ్ర అధికారులు ఎంతకు తెగించారో ఇట్టే అర్ధమవుతుంది. అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ఉన్న భూమిని కాజేసేందుకు లగడపాటి, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లు పార్టీలకతీతంగా తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 11 లో ఉన్న 150 కోట్ల రూపాయల విలువైన ఐదు ఎకరాల భూమిపై కన్నేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సంతోష్ తన బినామీ ప్రతాప్ రెడ్డితో ప్రయత్నాలు చేస్తున్నాడు. అంజునాబేగం పేరిట ఈ భూమికి ఎన్వోసీ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇక తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్న 300 కోట్ల విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని దోచుకోవడానికి రాధికా సొసైటీ పేరుతో కేవీపీ రామచంద్రరావు కుట్రలు చేస్తున్నాడు.

లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న డీబీఆర్ మిల్స్ భూమిని స్వాధీనం చేసుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి. సీమాంధ్రకు చెందిన అధికారులకు, రాజకీయనేతలకు భూములు కట్టబెట్టడంపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల కేటాయింపులు, ఎన్వోసీల జారీపై సమీక్షిస్తామని, అక్రమాలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా, సీమాంధ్రకు వెళ్ళినా రప్పించి విచారిస్తామని, ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *