లండన్ లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. TeNF ఈవేంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు, అలాగే “హైదరాబాద్ డెక్కన్ అసోసియేషన్” సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, అన్ని మతాలను గౌరవించడం మన తెలంగాణ సంస్కృతి – సంప్రదాయమని, ఇలా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, హాజరైన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యాక్రమంలో అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం, గంప వేణు, మరియు ఈవెంట్స్ ఇన్‌చార్జ్ నగేష్ రెడ్డితో పాటు సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడుదుల, మరియు సీనియర్ సభ్యులు, నరేశ్, గోలి తిరుపతి, నవీన్ రెడ్డి, సత్య, శ్రీకాంత్ జెల్ల తదితరులు పాల్గొన్నారు.