mt_logo

ఎన్నికల్లో పోటీ చేయను- ప్రొఫెసర్ కోదండరాం

కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ సమస్యలు- సవాళ్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం వరంగల్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయని, కానీ తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ తెలంగాణలోని అన్ని సమస్యలను పరిష్కరించాలని, బంగారు తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో 371-డీ అధికరణ క్రింద పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *