శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వరంగల్ లో పెద్దఎత్తున టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం కల్లా రెండువేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఇప్పటికే 1800 మెగావాట్ల విద్యుత్ కు బిడ్లు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్-మహబూబ్ నగర్ మధ్య కూడా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని, ప్రతీ జిల్లాలో ఉపాథి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దళితులు, గిరిజనులే కాకుండా మహిళా పారిశ్రామిక వేత్తలను కూడా ప్రోత్సహిస్తామని, స్కిల్ డెవెలప్మెంట్ పాలసీని తీసుకొస్తామన్నారు. 150 పారిశ్రామిక రంగాలతో ఐదు గంటలపాటు చర్చించి పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని, రానున్న పారిశ్రామిక అవకాశాలను ఎస్సీ, ఎస్టీ యువకులు అందుకునేలా అవగాహన కల్పిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
