mt_logo

‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ఆత్మగౌరవ వేదిక రూపొందించిన ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ క్యాలెండర్ ను గురువారం టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ కే బాల్ రెడ్డి, కో కన్వీనర్ కొణతం దిలీప్, ‘నమస్తే తెలంగాణ’ బతుకమ్మ ఎడిటర్ కందుకూరి రమేశ్ బాబు, బంగారు బ్రహ్మం, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షుడు డీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని, హైదరాబాద్ పై సర్వహక్కులు తెలంగాణకే ఉండాలనే ఆలోచనతో ఈ క్యాలెండర్ ను రూపొందించినట్లు అన్నారు. క్యాలెండర్ లో ఫొటోలను కందుకూరి రమేశ్ బాబు తీసారని, ఫొటోలకు వ్యాఖ్యానం చేసింది వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ అని, బంగారు బ్రహ్మం డిజైన్ చేశారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *