mt_logo

రేపు హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే మహాసభ

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్‌జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే) హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ ఎదుట ఉన్న రెడ్‌రోజ్ గార్డెన్స్‌లో మహాసభ నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో హైదరాబాద్ జర్నలిస్టులు అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ఈ మహాసభకు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఆయా పత్రికల సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభకు జర్నలిస్టులు అధికసంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *