జలయజ్ఞంలో నిర్వాసితులైన మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల బాధితులకు ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో 2,588, కరీంనగర్ లో 4,723 ఇండ్లు మంజూరయ్యాయి.
ఇదిలాఉండగా సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు.