హెరిటేజ్ సంస్థ అక్రమాలపై మాట్లాడితే టీడీపీ నేతలకు ఉలుకెందుకని, టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడకుండా హెరిటేజ్ సంస్థ డైరెక్టర్లుగా మాట్లాడుతున్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభలో హెరిటేజ్ పాల ఉత్పత్తి ప్రస్తావన రావడంతో టీడీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి పైవిధంగా స్పందించారు.
ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ, పంజాగుట్టలో తీసిన హెరిటేజ్ శాంపిల్ లో డిటర్జెంట్లు ఉన్నట్లు తెలిసిందని, పాల కల్తీని సీరియస్ గా పరిగణిస్తున్నామని, కల్తీ దందా చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్సిటోసిన్ వాడుతున్న పాలవ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 11 కంపెనీలపై కేసులు నమోదు చేశామని రాజయ్య పేర్కొన్నారు.