రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్, సంతోష్ గంగ్వార్, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరిలను కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర సమస్యలతో పాటు అనేక అభివృద్ధి అంశాలపై చర్చించానని, రాష్ట్రంలో మెగా పవర్ లూం, హ్యాండ్ లూం క్లస్టర్లు ఏర్పాటుచేయాలని కోరానని తెలిపారు.
వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు గురించి కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ తో మాట్లాడానని, టెక్స్ టైల్ ఇంక్యుబేషన్ సెంటర్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. రాష్ట్రం తలపెట్టిన వాటర్ గ్రిడ్ గురించి మంత్రి బీరేంద్రసింగ్ కు వివరించానని, ఇందుకు సంబంధించిన వ్యయం కేంద్రమే భరించాలని మంత్రికి చెప్పామని కేటీఆర్ పేర్కొన్నారు.