సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది. మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా? పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి? అని ఎద్దేవా చేశారు.
పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర. హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా? దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాద యాత్ర మొదలు పెట్టండి అని సవాల్ విసిరారు.
మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి? మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరం. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.
కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని పలుకుతూ.. రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- BRS govt. made decision to fund Formula-E race to boost Hyderabad’s brand: KTR
- Fact Check: Did the BRS govt. misappropriate Rs. 55 cr for Formula-E race?
- Impending liquor price hike to generate Rs. 7,000 cr revenue
- Telangana farmers in distress due to yield decline and lack of govt. support
- Congress govt’s apathy forces farmers to sell paddy to private millers
- ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు రేవంత్‌కు అలవాటుగా మారింది: కేటీఆర్
- పుట్టినరోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించు: రేవంత్‌కు హరీష్ రావు హితవు
- ఫార్ములా-ఈ రేస్ జరగకుండా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీసినందుకు రేవంత్‌పైనే కేసు పెట్టాలి: కేటీఆర్
- కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: కేటీఆర్ ధ్వజం
- రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- కేబినెట్ మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ప్రాజెక్టులా?: కేటీఆర్ ధ్వజం
- గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
- కేవలం బ్లాక్మెయిల్ దందా కోసం హైడ్రాని పెట్టారు: రియల్టర్స్ ఫోరం సమావేశంలో కేటీఆర్
- కుటుంబ సర్వే నుండి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలి: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
- ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: కేటీఆర్