విద్యావేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ. సాయిబాబా గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగటం శోచనీయం అని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. కానీ దశాబ్ద కాలం పాటు ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం. ప్రొఫెసర్గా పని చేస్తూ, ఆ హోదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారు అని విచారం వ్యక్తం చేశారు.
వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది న్యాయ సూత్రం. ఇది సాయిబాబా గారి విషయంలో వర్తిస్తుంది. సాయిబాబా గారు పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.
90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టీ నిర్బంధించడం బాధాకరం. నిర్దోషిగా బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగటం బాధాకరం అని హరీష్ రావు అన్నారు.
తన కండ్లు, శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు.
- Congress’s top brass remain silent on non-implementation of 6 guarantees
- Decision to convert TIMS into Sports Village sparks public outrage
- Police Act enforced in 20 districts; Is Telangana turning into a ‘Police State’?
- Fact Check: Congress government didn’t increase diet charges by 40%
- Local bodies to lose relevance with HYDRAA’s excessive powers
- తెలంగాణలో జరగుతున్న అరాచక పాలనపై రాహుల్ గాంధీ సమీక్ష చేయాలి: హరీష్ రావు
- గాంధీ భవన్కు కాదు.. ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- మంచి పనులు చేసిన సర్పంచులకు రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నాడు: హరీష్ రావు
- సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా?: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి రైతుల ఓట్లు కావాలి.. కానీ రైతుల వడ్లు పట్టవు: హరీష్ రావు
- హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం మూర్ఖపు చర్య: కేటీఆర్
- హామీల అమలు విషయంలో రాష్ట్ర, దేశ ప్రజలను రేవంత్ తప్పుదోవ పట్టిస్తునాడు: హరీష్ రావు
- పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
- పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: కేటీఆర్
- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు