చర్లపల్లి జైల్‌లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమయ్యింది. మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.
గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతాం అని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారు. లగచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్నావు. కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేసినవు అని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేసిండు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెబుతున్నరు. పోలీసులు ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చిందని చెబుతున్నరు. ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు అని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడు. అశోక్ నగర్‌లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు. రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు. పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు.గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు.చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటరు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత. మీరు అణిచివేస్తున్న విద్యార్థులు, పోలీసులు, రైతులు, గిరిజనులకు మద్దతు ఇవ్వడం మా బాధ్యత. వారి హక్కుల కోసం పోరాటం చేయడం మా బాధ్యత అని స్పష్టం చేశారు.
నువ్వు చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా. పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. నన్నో, కేటీఆర్‌నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు అని హరీష్ రావు సూచించారు
మా భూమి మాకు కావాలి అని పోరాటం చేస్తే వేధిస్తరా. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదు. ఇదేం ప్రజాస్వామ్యం.. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం ఇస్తున్న అని చెప్పినవు అని విమర్శించారు.
ఆరోజు మల్లన్న సాగర్‌లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు. నీకు రక్షణ ఇచ్చినం కదా, నిన్ను అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు. మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మా మధుసూదనాచారి గారు లగచర్లకు వెళ్తే అడ్డుకున్నవు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డిలను అడ్డుకున్నవు, ఎంపీ అరుణను వెళ్లకుండా అడ్డుకున్నవు అని దుయ్యబట్టారు.
తొమ్మిది నెలల గర్భిణి మీద చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన? అక్రమంగా అరెస్టు చేసి నరేందర్ రెడ్డి, కేటీఆర్ మీద కేసులు పెడుతవు కావొచ్చు. నిన్ను గద్దె దించడం మాత్రం ప్రజలు మరిచిపోరు అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో భూమి తయారు చేసిండు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం. ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తడట.. పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నడు. ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నది.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అని అడిగారు.
ఫార్మాసిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టు. కొడంగల్, జహీరాబాద్‌లలో ఫార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకో. నీ ప్రాధాన్యం అదానీ, నీ ప్రాధాన్యం నీ అల్లుళ్ళు. దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతది అని తెలిపారు
సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నవు. నువ్వు, కోదండరాం, దామోదర్ రాజనర్సింహ ప్రజల్ని రెచ్చగొట్టారు.. ఆనాడు మీమీద కేసులు పెట్టలేదు. ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద కేసులు పెడతరా అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో తెలియదు అన్నారు నరేందర్ రెడ్డి. కేటీఆర్ గారిని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేసారు అన్నడు. చదివే అవకాశం లేకుండా తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారు అన్నడు. నాకే సంబంధం లేదు, కేటీఆర్‌ను ఎందుకు ఇరికించారు అని చెప్పిండు. రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు, మేజిస్ట్రేట్ ముందుకు కూడా ఇదే చెప్పాను అన్నడు. నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి..బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు. బడా బడా బాబులకు భూములు కట్టబెడుతరా.. ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నరు, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాకు న్యాయం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయం అని అన్నారు.
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- Congress govt. gears up to fleece citizens through LRS; aims to mint Rs. 10k cr
- Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt.
- Bhima Project water to be diverted for pharma companies in Kodangal?
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు: హరీష్ రావు
- ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు
- మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్
- కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం: హరీష్ రావు
- కేటీఆర్‌ని కలిసిన టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు
- లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్
- లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ సర్కార్ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- లగచర్ల ఘటన తాలుకు సమాచారాన్ని కోరిన రాష్ట్రపతి కార్యాలయం
- విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్‌కు హరీష్ రావు హితవు