డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టుబడ్డ దొంగ ఈరోజు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చే సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల హరీష్ రావు ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉన్నది. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సంస్కారహీన సీఎం అని దుయ్యబట్టారు.
కేసీఆర్‌ను కొరివి దయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృ ద్రోహి రేవంత్‌కు ఈ మట్టి బిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయి అని ఎద్దేవా చేశారు.
నీ లాంటి కొరివి దయ్యాన్ని తెచ్చుకుని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పశ్చాతాపంతో ఉంది.. నీ లాంటి వాడి చేతికి పొరపాటున 2014లో అధికారం ఇస్తే తెలంగాణ వాడిని అమ్మేసే వాడివి. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కనుకే నువ్వు సీఎం కాగలిగావు. నీకు సీఎం అనే ఉద్యోగం కూడా కేసీఆర్ చలవే అని గుర్తుపెట్టుకో. నువ్వు ఇచ్చిన 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తుపెట్టుకో అని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్ఎస్. ఈయన చేసిన పనేందంటే వంట అయినంక గంటె తిప్పిండు గంతే.. నీయతున్నోడైతే నిజం చెబుతుండే.. నీయత్ అనేది ఆయన డిక్షనరీల లేదు గనుక అలవాటు ప్రకారం అబద్ధమే చెప్పిండు అని విమర్శించారు.
మూడు నెలల్లోనే ఇచ్చినం అని చెప్పుకున్న 30 వేల ఉద్యోగాల సంగతి కూడా ఇదే.. వాటికి నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్షలు నిర్వహించి బీఆర్ఎస్సే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్సే.. 7,094 స్టాఫ్ నర్సుల నియామకాల దగ్గర ఇదే అబద్ధం.. రేవంత్ నియామక పత్రాలు ఇచ్చిన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకైనా, సింగరేణిలో ఇచ్చిన ఉద్యోగాలకైనా, పోలీసు ఉద్యోగాలకైనా, టీచర్ల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు.
నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామకపత్రాలు ఇవ్వడం కుదురుతుందా? 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8792 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 1 1వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 12వేల నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ శాంక్షన్ ఇచ్చాం. అంతేకాదు ఇంటర్ కాలేజీల్లో 3096 మందిని, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 520 మందిని, డిగ్రీ కాలేజీల్లో 280 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. హయ్యర్ ఎడ్యుకేషన్ 3232 పోస్టులను, యూనివర్సిటీల్లో 1061 పోస్టులను మంజూరు చేసినం అని తెలిపారు.
ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు.. ఉద్యోగాలు పొందిన వారికి అనుభవంలో ఉన్న వాస్తవాలు.. 25 వేల పోస్టుల మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, మేమిచ్చిన 5089 డీఎస్సీ పోస్టులకు అదనంగా 6 వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసినవు అని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయులకు బిల్లా రంగాల గురించి చెబుతావా? విద్యార్థులకు బిల్లా రంగాల గురించి బోధించమని టీచర్లకు చెబుతున్నావా? రాహుల్ గాంధీని తీవ్రవాది అని ఓ కేంద్రమంత్రి అంటే దిష్టి బొమ్మలు కాల్చారు కదా.. నువ్వు సీఎం స్థానంలో ఉండి బిల్లా రంగాలతో పోల్చవచ్చా.. నీ దిష్టి బొమ్మలు ఎన్ని కాల్చాలి? రాహుల్ గాంధీకి ఓక నీతి మాకో నీతా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా? ఇదేమైనా కొత్తనా.. నువ్విపుడు ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా? కవిత ఎమ్మెల్సీగా ఓట్లతోనే గెల్చింది అని హరీష్ రావు అన్నారు.
కేసీఆర్ హయాంలో లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలిచ్చారు.. గతంలో అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? కేసీఆర్ మొదలు పెట్టిన 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియను చివరి దశలో పూర్తి చేస్తే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టా..అది నోరా? మోరా? నాలుకనా లేక తాటి మట్టనా? కట్టిన ఇంటికి సున్నం వేస్తే ఇల్లు నువ్వు కట్టినట్టేనా? అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా? నిరుద్యోగులను నీ స్వార్ధం కోసం రెచ్చగొట్టి మోసం చేస్తున్న దగాకోరువి నువ్వు.. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చింది నువ్వు కాదా.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థులను, నిరుద్యోగులను మభ్యపెట్టావు అని మండిపడ్డారు.
పది నెలలు అయినా రెండు లక్షల నియామకాల ఊసే లేదు.. విద్యార్థులు, నిరుద్యోగులు నీ మోసాన్ని అర్థం చేసుకున్నారు.నీకు కొలువు ఇచ్చిన నిరుద్యోగులే నీకు కొరివి పెడతారు. నిన్ను పడగొడతాం అని ఎవరో అన్నట్టు సానుభూతి రాజకీయాలు మొదలుపెడుతున్నావ.. నీ మాటలే నిన్ను పడగొడతాయి.. నీ గ్యారెంటీలే నీకు ఘోరీ కడతాయి అని జోస్యం చెప్పారు.
హర్యానా ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలకు గోరి తవ్వారు. తెలంగాణలో ఇప్పుడు బొంద తవ్వడం మొదలైంది. గంట కూడా రెస్ట్ లేకుండా పని చేస్తున్నా అని ఈ సిపాయి చెబుతున్నాడు.. అంత పని చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు? అని అడిగారు.
ప్రజలను ఎలా బాధ పెట్టాలో రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నావా.. తెలంగాణకు అసలు సిసలు కొరివి దయ్యం నువ్వే.. నీ నుంచి తెలంగాణను కాపాడే కొర్రాయి కేసీఆర్. నీ కాళ్లలో కట్టెలు పెట్టడం కాదు.. తెలంగాణను నీ దుష్ట పన్నాగం నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం.. ఉద్యమం తెలియని వాడివి తెలంగాణ ఆర్తి లేనివాడివి తాతకు దగ్గులు నేర్పుతావా? తెలంగాణ ద్రోహులకు కట్టు బానిసవు నువ్వు.. తెలంగాణ ప్రజలకు బానిసలం మేము అని హరీష్ పునరుద్ఘాటించారు.
- Public participation and engagement seen in 2014 comprehensive survey missing in 2023 caste survey
- Privacy concerns in caste survey as some enumerators insist on personal details
- KTR urges PM Modi to take action on AMRUT tenders scam in Telangana
- Is Congress govt. using Telangana public money for ads in Marathi newspapers?
- Is Congress govt. encouraging belt shops in rural areas to boost liquor sales?
- పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్
- రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే కొడంగల్‌లో ఫార్మా చిచ్చు: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింది: హరీష్ రావు
- పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్
- తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనమందించే ఘన నివాళి: కేసీఆర్
- ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ: కేటీఆర్
- సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు 70 ఎంఎం సినిమా ఉంది రేవంత్ రెడ్డికి: హరీష్ రావు
- ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో జరిగిన అమృత్ టెండర్ల స్కాంపైన ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలి: ఢిల్లీలో కేటీఆర్
- అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం చేసిన రేవంత్: కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు