mt_logo

తెలంగాణ కవులు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..

నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 2012 సంవత్సరానికి గానూ తెలుగు సాహితీ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ కవులు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. సాహితీవేత్తలు, రచయితలను ప్రోత్సహించేందుకు ఒక్కో రచన పబ్లికేషన్ కు రూ. 30 వేలు ఇస్తామని, యూనివర్సిటీలో లైబ్రరీ నిర్మాణానికి యూజీసీ నిధులు రూ. 5 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ భాష, యాస రచనలను తెలుగు యూనివర్సిటీ ప్రోత్సహించాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *