mt_logo

నిమ్స్ లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

నిమ్స్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిలకు చెందిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొదటి విడతలో భాగంగా డాక్టర్ల ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించడానికి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సీ లక్ష్మారెడ్డి అంగీకారం తెలిపినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ ను కలిసిన మంత్రి ఖాళీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించినట్లు, నిమ్స్ లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో జాబితా రూపొందించాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది.

నిమ్స్ లో ఏపీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని వచ్చిన ఫిర్యాదుపై కూడా మంత్రి ఆరా తీశారని, డాక్టర్ల భర్తీని జాతీయ స్థాయిలో చేపడితే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీ చేపడితే స్థానికత అనేది ఉండదని, ఇప్పటికే నిమ్స్ మొత్తం ఆంధ్రా డాక్టర్లతో నిండిపోయిందని, మొత్తం తెలంగాణ వారితోనే నింపాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది. పీజీ వైద్య విద్య పూర్తిచేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలనే నిబంధనను వినియోగించుకోవాలని, వీరిని వినియోగించుకుంటే పీజీ సీట్లు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *