గోదావరి జలాల విజయ యాత్ర పేరుతో నర్సంపేట నుండి ములుగు వరకు యాత్ర చేపట్టిన నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రామప్ప చెరువు నుండి పాకాల చెరువు వరకు 370 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టారని ఈ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల కల అని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీళ్ళ ప్రాధాన్యత తెలుసు కాబట్టి ఈ పనులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చారన్నారు.
మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముందుగా పెద్ది పిలుపుకు స్పందించి వచ్చిన వేల మంది రైతులకు ధన్యవాదాలు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల 65 వేల ఎకరాలుకు సాగునీరు అందబోతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన వారు ఎవరన్నా ఓడిపోతే మళ్ళీ ఎన్నికల వరకు కంటికి కనిపించరు కాని పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం మీ మీద నమ్మకంతో నర్సంపేటను అంటిపెట్టుకొని ఉన్నారు ఆ నమ్మకాన్ని నిజం చేయాల్సిన భాధ్యత మీ మీద ఉందన్నారు.
నేను పెద్ది లాంటి వాళ్ళం ఆంధ్ర పెత్తందార్ల గుండెల్లో నిద్రపోయినం, కాంగ్రెస్ టీడీపీ నాయకుల్లారా తెలంగాణ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న రోజు మీరంతా దద్దమ్మల్లా కూర్చున్నారు ఆనాడు తెలంగాణ నీళ్లు వస్తాయి అని చెప్పిన మాట నిజం చేసి చూపిస్తున్నాం, మీ వెకిలి చేష్టలు ఇక చెల్లవు ఇప్పటికే మీ పార్టీలను బొందపెట్టారు ఇక ముందు మీకు డిపాజిట్లు కూడా దక్కవు అని ప్రతిపక్ష పార్టీలను మంత్రి ఈటల హెచ్చరించారు.