రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియాను స్వాగతిస్తున్నామని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసిందని, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువు, కుంటల పునరుద్ధరణ వంటి ఎన్నో చక్కటి ప్రణాళికలు రూపొందించిందని ప్రశంసించారు.
వరంగల్ ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం కూడా చర్చిస్తుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారించి భవిష్యత్ లో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతానికి తాను పోటీ చేయనని, భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారని గద్దర్ అన్నారు.