– ఓటు హక్కు వినియోగించుకున్న నవదంపతులు
స్టేషన్ ఘణపురంలో ఓటు వేయడానికి వచ్చిన నవ దంపతులు మునిగెల రమేశ్, ఉమ
స్టేషన్‌ఘన్‌పూర్/మహబూబ్‌నగర్, మార్చి 1(టీన్యూస్): మహత్తరమైన తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చిన ఉప ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఉద్యమంలో స్వల్ప విరామం రావడంతో, ఏకంగా సెంటిమెంట్ లేదని సీమాంధ్రులు దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యవాదుల దిమ్మతిరిగే సంఘటనలు ఆదివారం నాటి పోలింగ్‌లో ఆవిష్కృతమయ్యాయి. సంప్రదాయాన్ని పక్కనబెట్టి పెళ్లి పీటల మీది నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని రెండు జంటలు సెంటిమెంట్ చాటిచెప్పాయి. పెళ్లయిన తర్వాత వెంటనే దేవాలయానికి వెళ్లడం సంప్రదాయం. కానీ సెంటిమెంట్‌ను నిరూపించేందుకు ఈ జంటలు పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన మునిగెల రమేష్, ఉమకు ఆదివారం ఉదయం పెళ్లి జరిగింది. వివాహ తంతు పూర్తవగానే ఓటుకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నవ దంపతులు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణవాదాన్ని గెలిపించేందుకే ఓటు వేశామని నవ దంపతులు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రవీంవూదనగర్ ప్రాంతానికి చెందిన కస పెంటయ్య ఆదివారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌కు చెందిన స్వాతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం వరుడు స్థానిక మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వధూవరులకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డికి చెందిన రాజ్‌కిరణ్ వివాహం లింగాపూర్‌కు చెందిన జ్యోతితో ఉదయం 11 గంటలకు పెళ్లి జరిగింది. ఉదయం 9 గంటలకు మాచారెడ్డిలో రాజ్‌కిరణ్ ఓటు వేసి లింగాపూర్ చేరుకున్నాడు. జ్యోతి సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నించగా ఆమె పేరు ఓటరు లిస్టులో గల్లంతైంది. [నమస్తే తెలంగాణ నుండి ]