పీపుల్స్ ప్లాజాలో జరిగిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ 303 క్యాబ్స్ ను డ్రైవర్లకు అందించింది. కొత్తగా క్యాబ్స్ తీసుకుంటున్న డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ పేరుకే మహానగరమైనా అనుకున్న సౌకర్యాలు లేవని, హైదరాబాద్ ను చూసి ఆశ్చర్యపడేలా శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గత పాలకులు హైదరాబాద్ ను భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు.
ప్రపంచ ఐటీ సదస్సు 2018లో హైదరాబాద్ లో జరగుతుందని, ఇది చాలా శుభసూచకమని, ఇలాంటి ఎన్నో సదస్సులకు హైదరాబాద్ వేదిక కావాలని సీఎం పేర్కొన్నారు. కేంద్రం స్కిల్ డెవెలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.