By: -గుణవీర శరత్చంద్ర
—
డొక్కు సైకిల్‌వాడు ఆడి క్యూకు ఎలా ఎదిగాడు?
చంద్రబాబే అబ్బో అని ముక్కున వేలేసుకునే విధంగా
రాజప్రసాదం ఎలా నిర్మించుకున్నాడు?
టీడీపీ టిక్కెట్లు, పోస్టులు ఇప్పించడానికి ఎవరిదగ్గర ఏమేమి తీసుకున్నాడు? ఎవరి దగ్గర ఏమి దోచుకున్నాడు?
1999 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు నిధులు పంచేప్పుడు
చంద్రబాబు రాసిచ్చిన పెన్సిల్ గీతలు మార్చేసి ఎవరెవరివద్ద ఎంత నొక్కేశాడు?
కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేయించి వాటాలు తీసుకున్న కమిషన్రాయుడెవరు?
బెజవాడ వద్ద పవర్ ప్లాంట్ పెట్టడానికి డబ్బులిచ్చిన మిత్రులకు ఎలా టోపీ పెట్టాడు?
తన పత్రికలో పెట్టుబడులు పెట్టిన భాగస్వాములను ఎలా నిలువునా ముంచాడు?
తను పత్రిక పెట్టడానికి నాలుగు కోట్లు ఇచ్చి, తాను పైకి రావడానికి సహకరించిన మిడ్వెస్ట్ రాఘవరెడ్డిని ఎలా ముంచాడు?
చివరికి మిడ్వెస్ట్ రాఘవరెడ్డిపైనే రాతలు రాసి ఎలా బ్లాక్మెయిల్ చేశాడు?
పత్రిక పెట్టేటప్పుడు చేబదుళ్ల పేరిట కోట్లు తీసుకుని మిత్రుల నెత్తిన శఠగోపం పెట్టినవాడెవడు?
సుజనా చౌదరి వరుసగా కుంభకోణాల కథలు రాసి ఆ తర్వాత ఎందుకు సైలెంటైపోయాడు?
ఇరిగేషన్ కాంట్రాక్టర్ల నుంచి నెలవారీ లక్షలాది రూపాయలు మామూళ్లుగా అందుకుంటున్నదెవడు?
2009 ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచి రాజశేఖర్‌రెడ్డి మీద వార్తలు రాయడం ఎందుకు ఆపేశాడు?
యూకో బ్యాంకుపై వరుస కథనాలు రాసి, పదికోట్ల రుణం తీసుకుని, ఇప్పటికీ పైసా కట్టకుండా వాళ్లను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు?
ఎంబీఎస్ జ్యువెలర్స్‌పై వార్తలు రాస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి రెండు కోట్లు కొట్టేసిన దందారాయుడెవరు?
గణపతి సచ్చిదానందపై వరుసకథనాలు రాసి కోట్ల రూపాయలకోసం బేరం పెట్టిందెవరు?
పత్రికను, చానెల్‌ను అడ్డంపెట్టుకుని ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్నదెవడు?
హైదరాబాద్‌ను సెటిల్మెంట్ల అడ్డాగామార్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లలో కోట్ల విలువజేసే భూములను కొల్లగొట్టిన ముఠాసభ్యులెవరు?
పదివేల కోట్ల విలువజేసే గురుకుల ట్రస్టు భూములను కాజేసిన సీమాంధ్ర ముఠాకు అండగా ఉన్నవాడెవడు?
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు-కిరణ్‌కుమార్‌రెడ్డిలను పత్రికలో మోస్తున్నదెవడు?
తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతున్నదెవడు?