mt_logo

లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై ప్రారంభమైన చర్చ

ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నాయి. ఎంపీలు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ తెలిపారు. సభ ప్రారంభం కాగానే తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ మొదలు పెట్టాలని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పీకర్ ను కోరగా ఆమె అందుకు అనుమతించారు. రిజర్వేషన్ల విషయమై ఏపీ సభ్యులతో పాటు తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యులు గొడవ చేయడంతో సభను ఆర్డర్లో పెట్టడానికి స్పీకర్ ప్రయత్నించినా లాభం లేకపోవడంతో సభను మధ్యాహ్నం 12.45 ని.ల.కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సుశీల్ కుమార్ షిండే చర్చను ప్రారంభించారు. తెలంగాణ డిమాండ్ చాలాకాలంగా ఉందని, ఈ అంశంపై అన్ని పార్టీలతో రెండు సంవత్సరాలుగా అనేక చర్చలు జరిపామని అన్నారు. సభలో మళ్ళీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *