తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వచ్చే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులందరూ ఆయన పేరును ఏకగ్రీవంగా బలపరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపించిన నాయకుడిగా, వివాదరహితుడిగా, అవినీతికి తావివ్వని నాయకుడిగా దేవీప్రసాద్ మంచిపేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇంక్రిమెంట్, 43 శాతం ఫిట్ మెంట్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారనే విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలోని పెద్ద నాయకులు కూడా దేవీప్రసాద్ పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించినట్లు తెలిసింది.