దళితులకు పంటలు పండే మూడెకరాల భూమిని కొనిస్తామని, భూపంపిణీ నిరంతర ప్రక్రియని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 1158 ఎకరాల భూమిని దళితులకు ఇచ్చామని, సూక్ష్మ సేద్యంలో దళితులకు వందశాతం సబ్సిడీ కల్పిస్తామని, దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని ఈటెల చెప్పారు.
మానవీయకోణంలో తాము బడ్జెట్ ప్రవేశపెట్టామని, తొలిసారిగా బడ్జెట్ పై ఎక్కువ రోజులు చర్చ జరిగిందని ఈటెల పేర్కొన్నారు. అంకెలు, లాభనష్టాల కోసం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదని, సంక్షేమంపై గతంలో ఎన్నడూ ఇన్ని గంటలు చర్చ జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రధానమని మంత్రి తెలిపారు.