mt_logo

కాపీ ఉద్యమానికి కాపీ కవరేజి

By Konatham Dileep

ఆయన పేరు కొమ్మినేని శ్రీనివాస రావు. N-TV అనే టీవీ చానెల్ కు చీఫ్ ఎడిటర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు.
ఆయన చానెల్ లో ప్రదర్శించే ప్రావీణ్యానికి తోడు సారు ఒక వెబ్ సైటు కూడా నడుపుతున్నాడు. 

www.kommineni.info అనే పేరు మీద ఉన్న అ వెబ్ సైటును ఆయన తెలంగాణవాదంపై విషం చిమ్మే
ఏకైక ఎజెండాతో నడుపుతున్నాడు. N-TV లో తెలంగాణ పై చిమ్మే విషం సరిపోక ఇది అదనపు డోస్
అన్నమాట. తెలంగాణ ఉద్యమం గురించిన ఎంత పాజిటివ్ వార్తలనైనా "తనదైన శైలి" లో నెగెటివ్ గా
రాయడంలో కొమ్మినేనిని మించినవారు లేరు.  

స్వంతంగా ఒక్క ఆలోచన కూడా రాని సీమాంధ్ర ఉద్యమ నాయకత్వంపై మొన్న నేనొక పోస్టు రాశాను.
(http://hridayam.wordpress.com/2011/07/11/copy-agitation/)
ఇవ్వాళ కొమ్మినేని గారు తిరుపతిలో జరిగిన వంటా వార్పు గురించి ఒక పోస్టు రాశారు.
అందులో యధాశక్తి సీమాంధ్ర ఉద్యమాన్ని పొగిడేసారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ సారు వారు
అక్కడే అతి తెలివి చూపించి అడ్డంగా దొరికిపోయారు.

తిరుపతిలో వంటా వార్పు వార్తకు ఆయనగారు వాడిన ఫొటో గత నెల హైదరాబాదులో జరిగిన వంటా వార్పు
సందర్భంగా తీసినది. గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యోగులు చేసిన వంటా వార్పు ఫొటోను కొమ్మినేని గారు
నిస్సిగ్గుగా వాడేసారు.
కొమ్మినేని పోస్టును ఈ కింది లింకులో చూడండి:
http://kommineni.info/articles/dailyarticles/content_20110713_21.php
-


-
ఆ ఫొటో హైదరాబాద్ లో తీసిందని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారని అంటారా?
ఎందుకంటే అది నేను తీసిందే కాబట్టి!

ఇదిగో ఒరిజినల్ ఫొటో
-



-

లేని ఉద్యమాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నిస్తే ఇలాగే దొరికిపోతారు మరి!

ఇంటర్నెట్లో ఒక సైట్ లోని ఫొటోలు ఇంకొక సైట్లో వాడుకోవడం మామూలే అయినా ఒక ఉద్యమానికి
సంబంధించిన ఫొటోలు సరిగ్గా ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమ కవరేజ్ కి వాడుకోవడం అయితే
జర్నలిజం వరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు. 

ఈ విధంగా మన కొమ్మినేని గారొక గొప్ప ట్రెండ్ సృష్టించారనుకోవాలి. 

ఇకపై సీమాంధ్ర చానెళ్లలో, పేపర్లలో "సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం" లాంటి వార్తలు వస్తే ఆయా వీడియోలు,
ఫొటోలు నిజమైనవా లేక కొమ్మినేని బ్రాండా అని కళ్ళు చికిలించుకుని చూడాలేమో మనం.


From: http://hridayam.wordpress.com/2011/07/14/copy-coverage/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *