ఎలక్షన్లు దగ్గరపడుతున్నయ్… కాంగ్రెస్ పార్టీ కి టీఆరెఎస్ పై దాడి చెయ్యడానికి అవినీతి ఆరోపణల్లేవ్, స్కాముల్లేవ్, స్కీముల్లో లోపాల్లేవ్.
ఏం చేసైనా సరే ఓట్లు సంపాదించాలన్న అత్యాశతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్న ఆన్లైన్ లో చేసిన ఘనకార్యం తిరిగి ఆ పార్టీకే చుక్కలు చూపించింది.
ఇంతకూ ఏం చేశారంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఎమ్మెల్ల్యే, ఇప్పటి మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీ ఆంధ్ర ప్రదేశ్ భవన్అ ధికారి చెంప చెళ్లుమనిపించిన వీడియోను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెరాస పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని అభాసు పాలు చేయడానికి పన్నిన దుర్మార్గపు ఆలోచన అది, కానీ ఆ పోస్ట్ కి తెలంగాణ నెటిజన్లు ఇచ్చిన రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించింది. చాలా మంది తెలంగాణ వాదులు ఈ పోస్ట్ చూసి ఆ ఉద్విగ్నమమైన ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చినందుకు సంతోషంగా ఉందని రెప్లైలు పెట్టారు. ఉత్తమ్ పోస్ట్ చేసిన ఈ ట్విట్టర్ వీడియో అసలే జోరు మీదున్న తెరాసా పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ పెంచిందని దానికి ప్రతిస్పందనగా వచ్చిన కామెంట్లను చూస్తే అర్థం అవుతుంది. టీఆరెఎస్ పార్టీ నాయకులను ప్రజలు విమర్శించేలా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్ర కాస్తా, ఉద్యమ పార్టీ TRS కి మరింత సానుభూతిని తెచ్చి పెట్టేటట్లు అయ్యేసరికి ఉత్తమ్ కి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కి దిక్కుతోచనట్లయ్యింది.. అసలు ఆ వీడియో కాంటెక్స్ట్ ఏంటి, హరీష్ రావు ఏ పరిస్థితులలో అలా చేశారు, సదరు అధికారి ఆ తరువాత ఏం వివరణ ఇచ్చాడు – అన్న విషయాల గురించి అవగాహన లేకుండా ఈ పోస్ట్ పెట్టిన అతి తెలివితేటలు ఉత్తమ్ వేనా లేక… ఢిల్లీ నుండి వచ్చిన.. ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమువా అన్న విషయం అర్థం కాక ఆ పార్టీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు.
కిందున్నవి ఉత్తముడి ట్వీట్ కి వచ్చిన ప్రతిస్పందనల్లో మచ్చుకి కొన్ని. ఇవి చాలు కాంగ్రెస్ పార్టీ ని సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అని ఎందుకంటారో అర్థం కావడానికి…