రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి, నేతలకు పెద్ద చిరాకు వ్యవహారంగా మారింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండున్నర సంవత్సరాలు దాటినా, పార్టీ నాయకులతో సఖ్యత సాధించడంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యారు. సఖ్యత మాట అటుంచితే, తన లాభం కోసం రేవంత్ మాట్లాడే మాటలు, చేసే చేతలు కాంగ్రెస్ పుట్టిని ఎప్పుడో ముంచుతాయని కాంగ్రెస్ నాయకుల భయం. రేవంత్ ట్రాక్ రికార్డ్ అలాంటిది.
GO 111 విషయంలో అధికార పక్షంపై చేస్తున్న ప్రచారంతో రేవంత్ లేని పోని తలనొప్పి కొని తెచ్చాడు అని కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు, కొందరు బీజేపి, తెదేపా నేతలకు కూడా ఈ విషయంలో రేవంత్ పై పీకలదాకా కోపం. కారణం.. GO 111 పరిధిలో ఈ నాయకులకు చాలామందికి ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి. తన స్వార్థం కోసం రేవంత్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టడానికి అధికార పక్షం అన్ని వివరాలూ తవ్వితే కాంగ్రెస్, బీజేపి, టీడీపీ నాయకులకు ఉన్న ఫార్మ్ హౌస్ ల చిట్టా బయటికి రానుంది. దీంతో అందరి నేతల గుండెల్లో గుబులు. అంతర్గత సమావేశాల్లో రేవంత్ మీద ఆగ్రహం వెళ్లగక్కుతున్న ఈ నేతలు.
కాంగ్రెస్ నాయకులు అనుకున్నట్టే అయింది. GO 111 పరిధిలో రేవంత్ రెడ్డి కి భారీగా భూములున్నాయి అని టీఆర్ఎస్ నాయకులు పక్కా ఆధారాలను ప్రజల ముందుంచారు. రేవంత్ రెడ్డి కి చెందిన ఈ భూముల్లో అనేక అక్రమ కట్టడాల వివరాలు బయటపడటంతో రేవంత్ రెడ్డి ఆరోపణల వెనుక రహస్యం ప్రజలకే కాదు… ఈ నాయకులకు కూడా అర్థం అయ్యింది. కేవలం తాను చేస్తున్న అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, దొంగ ప్రచారాలు చేస్తున్న రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ఇతర పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.