ఎంసెట్ అడ్మిషన్లు త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఎంసెట్ కన్వీనర్ ప్రొ. రమణారావు, జేఎన్టీయూ వీసీ హాజరయ్యారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ సచివాలయంలో ఐటీ, పంచాయితీ రాజ్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పీ సంతోష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంతోష్ కుమార్ ను డిప్యూటీ కార్యదర్శి హోదాలో నియమించినట్లు సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.